ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నటి సాయి పల్లవి (Sai pallavi) అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సాయి పల్లవి తాజాగా అమరన్ (Amaran) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ ఉగ్రవాది దాడిలో అమరులయ్యారు.ఈయన బయోపిక్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
![Telugu Amaran, Nitin, Nani Amaran, Nithin, Sai Pallavi-Movie Telugu Amaran, Nitin, Nani Amaran, Nithin, Sai Pallavi-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Hero-Nithin-sensational-comments-on-sai-pallavi-acting-in-amaran-movie-b.jpg)
ఈ సినిమాలో నటుడు శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) సాయి పల్లవి జంటగా నటించారు.ఇక తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఈ సినిమాకు కమల్ హాసన్(Kamal Hassan) నిర్మాతగా వ్యవహరించారు.ఇక ఈ సినిమా తెలుగు హక్కులను హీరో నితిన్(Nirhin) తండ్రి సుధాకర్ రెడ్డి కొనుగోలు చేశారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హైదరాబాద్లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో నితిన్ హాజరయ్యారు.
![Telugu Amaran, Nitin, Nani Amaran, Nithin, Sai Pallavi-Movie Telugu Amaran, Nitin, Nani Amaran, Nithin, Sai Pallavi-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Hero-Nithin-sensational-comments-on-sai-pallavi-acting-in-amaran-movie-c.jpg)
ఈ కార్యక్రమంలో భాగంగా హీరో నితిన్ (Hero Nitin)మాట్లాడుతూ నాన్న అమరన్ (NANI Amaran)సినిమా హక్కులను కొనుగోలు చేస్తున్న సమయంలో ఎందుకు నాన్న ఈ సినిమా హక్కులను కొనుగోలు చేస్తున్నారని నేను అడిగాను.అప్పుడు ఆయన సమాధానం చెబుతూ ఈ సినిమాని కేవలం నేను సాయి పల్లవి కమల్ హాసన్ గారిని నమ్మే కొంటున్నాను అని చెప్పారు.ఆయన నమ్మకం నేడు నిజమైంది.ఈ సినిమాకు సాయి పల్లవి బ్యాక్ బోన్ అంటూ కామెంట్ చేశారు.ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమె నటన అద్భుతమని ఆమెతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.ఇక సాయి పల్లవితో డాన్స్ చేయడం అంటే ఒక సవాల్ అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటన గురించి చెప్పాలి అంటే నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ అంటూ నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.