ఇదే మాట ఇప్పుడు దేశమంతటా వినబడుతుంది.ఎందుకంటే ఇప్పుడు తెలుగు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఇరగదీస్తున్నారు కాబట్టి.
గతంలో మన సినిమాలకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ జరిపేవారు మూవీ మేకర్స్.అయితే గత కొన్నాళ్లుగా బడా హీరోల సినిమాలకు అస్సలు ప్రమోషన్స్ చే( Promotions )స్తున్న దాఖలాలే మనకి కనబడడం లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.2012లో విడుదలైన బాహుబలి సినిమాకు దారుణమైన ప్రమోషన్స్ చేయడం జరిగినది.ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ స్టామినా ఏమిటో ఇండియా మొత్తం తెలియడంతో గ్రాండ్ ఈవెంట్స్ చేస్తే అనవసరమైన ఖర్చు అయిపోతుందని భావించారో ఏమో మరి? ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అస్సలు ఈవెంట్స్ చేయడం మానేశారు.అయినా ప్రభాస్ కటౌట్ చూసి జనాలు ఆయా సినిమాలను ఆదరించారు.ఈ క్రమంలో వచ్చినవే సలార్, కల్కి( Salar, Kalki ) సినిమాలు.
![Telugu Allu Arjun, Ntr, Kalki, Prabhas, Pushpa, Salar, Tollywood-Movie Telugu Allu Arjun, Ntr, Kalki, Prabhas, Pushpa, Salar, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/10/promotions-Salar-Kalki-prabhas-pushpa-2-tollywood-Junior-NTR-allu-arjun-prabhas-social-media.jpg)
ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు మన మిగతా పాన్ ఇండియా సినిమా హీరోలు.వచ్చే నెలలో పుష్ప 2 ( Pushpa 2 )సినిమా రిలీజ్ అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.అయినా ఇప్పటివరకు ఈ చిత్ర యూనిట్ ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్ తప్పితే ఎటువంటి హంగామా అక్కడ కనబడలేదు.
అల్లు అర్జున్( Allu Arjun ) అయితే పత్తాకే కనబడలేదు.ఇక మనటికి మొన్న రిలీజ్ అయిన దేవర సినిమా కథ కూడా అంతే.
సినిమా రిలీజ్ అయిన అంతవరకు, అసలు రిలీజ్ ఎప్పుడో తెలియదు అన్న పరిస్థితి ఉండేది! అయితే జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అవడంతో దేవర సినిమా ఫలితం ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది.
![Telugu Allu Arjun, Ntr, Kalki, Prabhas, Pushpa, Salar, Tollywood-Movie Telugu Allu Arjun, Ntr, Kalki, Prabhas, Pushpa, Salar, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/10/without-promotions-Salar-Kalki-prabhas-pushpa-2-tollywood-Junior-NTR-allu-arjun-prabhas-social-media.jpg)
ఇక ఇదే ఒక చెందుతాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.మరో రెండు మూడు నెలల్లో, అంటే సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ సినిమాతో చరణ్ బరిలో దిగనున్నాడు.అయినా టాలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి హంగామా కూడా కనబడడం లేదు.
అవును, టాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటడంతో మనవాళ్లకు ఇక ప్రత్యేకించి మార్కెట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.ఈ తరుణంలోనే మెగా ఈవెంట్స్ చేయడానికి కావలసిన భారీ మొత్తాన్ని మన వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థం అవుతుంది.
నిజమే, తెలుగు హీరోలకు ఇక ఎక్కడికి వెళ్ళినా తిరుగులేదనే మాట అక్షర సత్యం.