మంచు విష్ణు( Manchu Vishnu ) హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప( Kannappa ).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడం విశేషం.ఈ సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా, ప్రభాస్,( Prabhas ) అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్నారు.ఇక ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) అవా ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
![Telugu Akshay Kumar, Jyotirlingas, Kannappa, Kedarnath, Manchu Vishnu, Manchuvis Telugu Akshay Kumar, Jyotirlingas, Kannappa, Kedarnath, Manchu Vishnu, Manchuvis](https://telugustop.com/wp-content/uploads/2024/10/Manchu-vishnu-and-kannappa-movie-team-visit-kedarnath-detailsa.jpg)
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ టీజర్ 20మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.ఇక ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం జ్యోతిర్లింగాల సందర్శనకు వెళ్లారు.ఇందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
![Telugu Akshay Kumar, Jyotirlingas, Kannappa, Kedarnath, Manchu Vishnu, Manchuvis Telugu Akshay Kumar, Jyotirlingas, Kannappa, Kedarnath, Manchu Vishnu, Manchuvis](https://telugustop.com/wp-content/uploads/2024/10/Manchu-vishnu-and-kannappa-movie-team-visit-kedarnath-detailsd.jpg)
12 జ్యోతిర్లింగాల ప్రయాణాన్ని ప్రారంభించాం.పవిత్ర క్షేత్రం కేదార్ నాథ్‌ను సందర్శించాం.కన్నప్ప సినిమా కోసం ప్రార్థించామని మంచు విష్ణు తెలిపారు.ఇక ఈ జ్యోతిర్లింగాల సందర్శనార్థంలో భాగంగా మోహన్ బాబు మంచు విష్ణుతో పాటు ఇతర చిత్ర బృందం కూడా ఉన్నారు.
ఇక ఈ సినిమా అధిక భాగం న్యూజిలాండ్ లోనే షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాల గురించి సరైన స్పష్టత రావాల్సి ఉంది.