ట్రాఫిక్ రూల్స్ పాటించండి...!

నల్లగొండ జిల్లా: రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలు పాటించే విషయంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్‌ సిఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

 Follow Traffic Rules District Sp Sarath Chandra Pawar, Traffic Rules, District S-TeluguStop.com

ఈ సందర్భంగా సీఐ మాట్లడుతూ పాదచారులు ఫుట్‌పాత్‌ల పైనే నడవాలని,ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చన్నారు.ట్రాఫిక్‌ పోలీసులు సూచించే విషయాలని పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్‌ చెయ్యొద్దని, తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని, అలాగే మద్యం సేవించి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడపడం వల్ల వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని సూచించారు.ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జాగృతి పోలీస్ కళాబృందం ఆటపాటలతో వాహనదారులు మరియు పాదాచారులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి, ఏఎస్ఐలు ఫరీద్, సత్యనారాయణ,ట్రాఫిక్‌ సిబ్బంది,జాగృతి పోలీస్ కళాబృందం ఇంచార్జ్ హుస్సేన్,శేఖర్,సత్యం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube