నల్లగొండ జిల్లా: కేతేపల్లి మండల పరిధిలోని మూసి ప్రాజెక్టు ఆధునీకీకరణ చేసి,పర్యాటక కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బొప్పారం మీదగా గుడివాడ, కొర్లపహాడ్,కేతపల్లి వరకు 12 కి.మీ మేర చేపట్టిన పాదయాత్రను సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎర్రజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసిలో పేరుకుపోయిన ఇసుక షీల్డ్ తీసేసి శుద్ధి చేసి,డ్యామ్ యొక్క సామర్థ్యం పెంచాలని,ప్రస్తుతం నాలుగు టీఎంసీల పైపడి ఉండగా మూడు టీఎంసీల వాటరు మాత్రమే నిల్వ ఉన్నాయని,అందుకే ఆధునీకరించి నాలుగు టీఎంసీలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మూసి పరివాహక ప్రాంతంలో రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని, రోడ్లన్నీ మరమ్మతులు చేయించి,పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజల పక్షాన కోరారు.మూసీ నది సుందరీకీకరణకు రూ.150 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, కొంతవరకే సరిపెట్టకుండా చివరి వరకు పూర్తిగా ఆధునీకరించాలన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి పనులు చేయకపోవడం వలన ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని అది గుర్తుపెట్టుకుని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని సూచించారు.ఈ పాదయాత్రలో సిపిఎం నల్లగొండ జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యురాలు కందాల ప్రమీల,జిల్లా కమిటీ సభ్యులు బుద్ధ చిన్న వెంకన్న,బండమీది రమేష్,అక్కనపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.