సినిమా కోసం చాలామంది ప్రాణమిస్తారు.సినిమాలో పాత్ర చక్కగా రావాలని ఎంతో కష్టపడి నటిస్తారు.
అలా ప్రతిసారి కష్టపడితేనే ఫలితం వస్తుంది.అందుకే ఏ విషయంలోను వెనక్కి తగ్గకుండా నటీనటులు ప్రాణం పెట్టి పని చేస్తారు.
ఇక్కడ వరకు ఓకే కానీ కొన్నిసార్లు అవసరం ఉన్న లేకపోయినా ప్రాణాల మీదికి తెచ్చుకొని రిస్క్ చేసిన హీరోస్ కూడా కొంతమంది ఉన్నారు.దానివల్ల ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి అందులో కొన్ని విషయాలు బయటకు వస్తాయి మరికొన్ని షూట్ లొకేషన్ నుంచి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడతారు.
అలా రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ( Real Instruments )తో ప్రయోగాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న కొంతమంది స్టార్ హీరోస్( Star Heroes ) ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Allari Naresh, Rajesh, Heros, Polimera, Prabhas, Senior Ntr, Heroes-Telug Telugu Allari Naresh, Rajesh, Heros, Polimera, Prabhas, Senior Ntr, Heroes-Telug](https://telugustop.com/wp-content/uploads/2024/06/Heros-who-risk-their-life-for-movieb.jpg)
శంభో శివ శంభో సినిమాలో అల్లరి నరేష్( Allari Naresh ) నీ వెనకనుంచి పెద్ద రాడుతో దాడి చేసే సీన్ ఉంటుంది.ఆది నిజమైన రాడ్ తో చేయాలని రిస్క్ చేసి కొట్టడంతో దెబ్బ బాగా తగిలించే రక్తం కూడా వచ్చిందట.దీని తర్వాత మూడు రోజుల వరకు ఆయన షూటింగ్ కి కూడా రాలేకపోయారట.
లక్ష్మీ కటాక్షం సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )సైతం రియల్ కత్తిని క్లైమాక్స్ సీన్ లో వాడటంతో పక్కకు పడిపోవాల్సిన కత్తిని కాస్త చేతులతో పట్టుకోవడంతో బాగా గాయాలయ్యాయి.ప్రభాస్( Prabhas ) సైతం చత్రపతి సినిమాలో కాట్రాజ్ బీచ్ లో కొట్టే సన్నివేశంలో నిజమైన కర్రలను వాడారట.
![Telugu Allari Naresh, Rajesh, Heros, Polimera, Prabhas, Senior Ntr, Heroes-Telug Telugu Allari Naresh, Rajesh, Heros, Polimera, Prabhas, Senior Ntr, Heroes-Telug](https://telugustop.com/wp-content/uploads/2024/06/Heros-who-risk-their-life-for-moviec.jpg)
దాంతో ఆయన వీపు మొత్తం వాచిపోయి రెండు రోజుల వరకు షూటింగ్ కి రాలేదట.ఇక మా పొలిమేర 2 సినిమాలో నిజమైన మంత్రాలనే చదివారట హీరో రాజేష్( Hero Rajesh ).అయితే అదే సమయానికి సరిగ్గా లైట్ ఆఫ్ చేయడంతో భయపడిన రాజేష్ కి రాత్రి జ్వరం కూడా వచ్చిందట దాంతో రెండు రోజుల పాటు షూటింగ్ కి రాలేదట.సీనియర్ హీరో నరేష్ సైతం ఒక సినిమా షూటింగ్లో బైక్ పైనుంచి 12 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారట.
ఆ సినిమా తర్వాత మూడు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారట.