నందమూరి కుటుంబం నుంచి ఆ సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )తర్వాత ఆ రేంజ్ లో క్లిక్ అయిన నటులు చాలా తక్కువ అని చెప్పాలి.బాలకృష్ణ తన మటుకు తను బాగానే లాగించేసాడు.
అయితే తన బ్లడ్డు బ్రీడ్ అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేసి ఆటిట్యూడ్ కి బాప్ అనే పేరు తెచ్చుకున్నాడు.ఇక అందరూ వద్దన్నా అవునన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ నందమూరి కుటుంబానికి ఇప్పటి వరకు మిగిలిన ఏకైక దిక్కు.
నందమూరి ఇంటి పేరు నిలబెడుతున్న జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కి తారక్ అనే పేరు మొదటి నుంచి ఉంది.ఎన్టీఆర్ తన పేరును తారక్ కి ఇచ్చినప్పటికీ ఆ పేరుతో పిలిపించుకోవడం జూనియర్ కి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
అందుకు తన కారణాలు తనకున్నాయి మహానటి మరియు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నిసార్లు అడిగినా నటించలేదట.అలాంటి మహానుభావుడి స్థానాన్ని రీప్లేస్ చేసే మరో నటుడు ఇప్పటి వరకు పుట్టలేదు ఇకపై పుట్టబోడు అనేది తారక్ వాదన.అలాగే ఆయన పేరు పెట్టుకుని ఆ స్థాయికి వెళ్లే అవకాశం కూడా తనకు లేదు అని నమ్ముతాడు అందుకే తారక్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు.ఇక ఇప్పుడు మూడోతరం వ్యక్తిగా హరికృష్ణ మనవడిగా మరో ఎన్టీఆర్ తెరపైకి వస్తున్నాడు.
అతని పేరు కూడా ఎన్టీఆర్.హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కుమారుడే ఈ ఎన్టీఆర్.
ఇప్పుడు హరికృష్ణ జానకి రామ్ ఇద్దరు లేరు రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు.
ఇక లాంచ్ చేయబోతున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి( Director YVS Chaudhary ).మొదట్లో కమర్షియల్ గా హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అనేక ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు ఆర్థికంగా కూడా నష్టపోయాడు ఈ మధ్యకాలంలో ఒక కాస్తా కోరుకున్నాడు.దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత నందమూరి ఇంటి మూడో తరం వారసుడిని లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
మరి ఇతడిని ఏమని పిలవాలి అని చాలామంది ఈ సందేహ పడుతున్నారు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, సబ్ జూనియర్ ఎన్టీఆర్ అని పిలవాలా అంటూ ట్రోల్ చేసే వాళ్ళు కూడా మొదలయ్యారు.ఇక ఆ రక్తంలోనే నటన ఉంది కాబట్టి కాస్త కష్టపడితే హీరో అయిపోవడం గ్యారెంటీ.
ఇక తనలాగా రెండవ తరంలో చాలామంది ప్రయత్నించిన ఎవరు హీరోలు అవ్వలేకపోయారు.తారకరత్న నుంచి చైతన్య కృష్ణ వరకు అందరూ నటన నుంచి చాలించుకున్నారు.