పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భువనగిరి బీజేపీలో( Bhuvanagiri BJP ) గ్రూప్ వార్ నెలకొంది.నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) వైఖరిపై పార్టీ సీనియర్లు కినుక వహించారని తెలుస్తోంది.
బూర నర్సయ్య గౌడ్ కుల రాజకీయాలు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా బీఆర్ఎస్ కు కోవర్టుగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ నేతలు గూడూరు నారాయణ రెడ్డి,( Gudur Narayana Reddy ) శ్యామ్ సుందర్( Shyam Sundar ) ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని సమాచారం.నియోజకవర్గంలో నెలకొన్న గ్రూప్ వార్ తో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.
అయితే మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బూర నర్సయ్య గౌడ్ వ్యవహారం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.