టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా కొనసాగుతున్నటువంటి చిట్టిబాబు( Chitti Babu )వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈయన సినిమాలకు రాజకీయాలకు సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను మాట్లాడుతూ వార్తలలో నిలుస్తుంటారు అయితే తాజాగా చిరంజీవి కూటమికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ వీడియో పై చిట్టి బాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి రాజీనామా చేయకుండానే కూటమికి ఎలా మద్దతు తెలుపుతారని ఆయన ప్రశ్నించారు.
![Telugu Ap, Chiranjeevi, Chitti Babu, Pawan Kalyan-Movie Telugu Ap, Chiranjeevi, Chitti Babu, Pawan Kalyan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Producer-chittibabu-sensational-comments-on-Chiranjeevi-and-Pawan-Kalyanb.jpg)
చిరంజీవి ( Chiranjeevi ) ఇలా కూటమికి మద్దతు తెలపడం వెనుక పెద్ద కారణం ఉండవచ్చని ఆయన తెలిపారు.ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చిరంజీవి గ్రహించారు.ఇలా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంటే తనకు మరిన్ని అవార్డులు వస్తాయని భావించారేమో అందుకే కూటమికి మద్దతు తెలుపుతున్నారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఒకప్పుడు ఈ కూటమి చిరంజీవి కుటుంబాన్ని మెగా పరువు ప్రతిష్టలను బజారుకి ఈడ్చింది ఆ విషయాలని బహుశా చిరంజీవి మరిచిపోయారేమో అంటూ ఈయన వ్యాఖ్యలు చేశారు.
![Telugu Ap, Chiranjeevi, Chitti Babu, Pawan Kalyan-Movie Telugu Ap, Chiranjeevi, Chitti Babu, Pawan Kalyan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Producer-chittibabu-sensational-comments-on-Chiranjeevi-and-Pawan-Kalyanc.jpg)
ఇక పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి కూడా ఈయన మాట్లాడారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులలోనూ గెలవరని ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.పవన్ స్థానికులు కాదు కానీ వంగా గీత అక్కడే ఉంటారు ఆమె అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకొని వారి అవసరాలను తీరుస్తారు.అందుకే అక్కడ వంగ గీతానే గెలుస్తుంది అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఏపీలో 130 సీట్లకు పైగా వైసిపి అధికారంలోకి వస్తుందని ఈయన జోస్యం చెప్పారు.ఏది ఏమైనా ఏపీ రాజకీయాల గురించి చిట్టిబాబు ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.