డ్రై స్కిన్ కు గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నారా.. అయితే ఈ న్యాచుర‌ల్ క్రీమ్ మీకోస‌మే.

డ్రై స్కిన్( Dry skin ) .చాలామందిని కలవర పెట్టే సమస్యల్లో ఒకటి.

 This Natural Cream Helps To Get Rid Of Dry Skin! Natural Cream, Dry Skin, Oats,-TeluguStop.com

సహజ తేమను కోల్పోయినప్పుడు చర్మం పొడి పొడిగా మారిపోతుంది.పర్యావరణ కారకాలు, వృద్ధాప్యం, జన్యుశాస్త్రం, క‌ఠీన‌మైన సోప్స్ ను వాడ‌టం, వేడి వేడి నీటితో స్నానం చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల చర్మం దాని సహజ నూనెలను కోల్పోతుంది.

ఫ‌లితంగా స్కిన్ దురదగా, గరుకుగా మరియు పొరలుగా త‌యార‌వుతుంది.ఇటువంటి చ‌ర్మాన్ని ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌రు.

ఈ క్ర‌మంలోనే డ్రై స్కిన్ ను వ‌దిలించుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు.మీరు కూడా డ్రై స్కిన్ కు గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నారా.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్ ( Natural cream )మీకు చాలా బాగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Telugu Tips, Dry Skin, Face Cream, Skin, Homemade Cream, Oats, Oats Benefits, Oa

ఓట్స్( Oats ) ఆరోగ్యానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి కూడా స‌హాయ‌ప‌డ‌తాయి.ఓట్స్ లో ఉండే పోష‌కాలు పొడి చర్మాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి.చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా మారుస్తాయి.

డ్రై స్కిన్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కూడా ఓట్స్ హెల్ప్ చేస్తాయి.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి వాట‌ర్ పోసి ప‌ది నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి.

Telugu Tips, Dry Skin, Face Cream, Skin, Homemade Cream, Oats, Oats Benefits, Oa

ఇలా నాన‌బెట్టుకున్న ఓట్స్ ను మిక్సీ జార్‌లో మెత్త‌గా గ్రౌండ్ చేసి మిల్క్ ను స్టైన్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్‌( Aloe vera gel ), ఐదు టేబుల్ స్పూన్లు ఓట్స్ మిల్క్, వ‌న్ టేబుల్ స్పూన్‌ గ్లిజ‌రిన్‌, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఒక మంచి క్రీమ్‌ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని రోజుకు రెండు సార్లు వాడితే మంచి ఫ‌లితాలు పొందుతారు.డ్రై స్కిన్ ను రిపేర్ చేయ‌డంతో ఈ ఓట్స్ క్రీమ్ చాలా ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

నిత్యం ఈ క్రీమ్‌ను వాడితే ఈ పొడి చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube