తియ్యటి మరియు జ్యూసీ పుచ్చకాయలు తినే సమయం ఆసన్నమైంది.ప్రస్తుత వేసవికాలంలో విరివిరిగా లక్ష్యమయ్యే ఫ్రూట్స్ లో పుచ్చకాయ( Watermelon ) ముందు వరుసలో ఉంటుంది.
ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలను కలిగి ఉండే పుచ్చకాయను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాయి.సమ్మర్ లో మనల్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్( Dehydration ) కు గురికాకుండా రక్షించడానికి, నీరసం అలసట వంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి, దాహార్తిని తీర్చడానికి పుచ్చకాయ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకే నిపుణులు కూడా వేసవి కాలంలో రోజుకు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకోమని సూచిస్తున్నారు.అయితే తెలిసో తెలియకో పుచ్చకాయ తినే క్రమంగా కొన్ని తప్పులు చేస్తుంటారు.
ముఖ్యంగా పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది.మీరు కూడా పచ్చకాయను ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటున్నారా.
అయితే మీ ఆరోగ్యం మటాష్.పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సిలతో సహా అనేక రకాల పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
అయితే పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల ఆ పోషకాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి.కొన్ని అధ్యయనాల ప్రకారం.గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పుచ్చకాయలో ఫ్రిడ్జ్‌లో ఉంచిన పుచ్చకాయ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయని వెల్లడైంది.అలాగే కొందరు పుచ్చకాయను కట్ చేసి రిఫ్రిజిరేటర్ లో పెడుతుంటారు.
ఇలా చేయడం చాలా ప్రమాదకరం.కట్ చేసిన పుచ్చకాయను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు.
కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.అటువంటి పుచ్చకాయను తింటే ఫుడ్ పాయిజన్( Food poisoning ) అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి.కాబట్టి, పుచ్చకాయ యొక్క ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించాలి అనుకుంటే గది ఉష్ణోగ్రతలో ఉంచి తినడమే చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం వల్ల పుచ్చకాయలో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు చెక్కుచెదరకుండా ఉంటాయి.