నిమ్మ తోటల్లో( Lemon Crop ) అధిక దిగుబడులు సాధించాలంటే పూత నియంత్రణ యాజమాన్యంలో సరైన మెళుకువలు పాటించాలి.పూత సంవత్సరం పొడుగునా వస్తూనే ఉంటుంది కానీ అధిక దిగుబడి రావాలంటే మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే.
అంటే కేవలం ఒక్క సీజన్లో మాత్రమే పూతను నిలుపుకోవాలి.జనవరి- ఫిబ్రవరి నెలలో తోటలు పూతకు వస్తే.
పంట దిగుబడి రావడానికి మూడు నెలల సమయం పడుతుంది.అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు దిగుబడి వస్తుంది.
జూన్ జూలై నెలలో పూతకు వచ్చిన పంట అక్టోబర్ లో చేతికి వస్తుంది.
రైతులు తోటలకు ఎప్పుడు పడితే అప్పుడు నీటి తడులు అందించడం వల్ల సరైన సమయంలో చెట్లు పూతకు రావడం లేదు.
వేసవికాలంలో( Summer ) నిమ్మకాయలకు మంచి డిమాండ్ కాబట్టి వేసవిలో అధిక దిగుబడి సాధించడానికి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.వేసవికాలంలో దిగుబడి రావాలంటే నవంబర్లో నిమ్మ చెట్లను( Lemon Trees ) నీటి ఎద్దడికి గురి చేయాలి.
నిమ్మ చెట్లకు పూత బాగా రావాలంటే కొమ్మల్లో పిండి పదార్థాలు ఎక్కువగా, నత్రజని మోతాదు తక్కువగా ఉండాలి.
![Telugu Cattle Manure, Yields, Lemon Crop, Lemon, Lemon Farmers, Lemon Trees, Pes Telugu Cattle Manure, Yields, Lemon Crop, Lemon, Lemon Farmers, Lemon Trees, Pes](https://telugustop.com/wp-content/uploads/2024/03/Tips-of-high-yields-and-pest-control-in-lemon-cultivation-detailsa.jpg)
నిమ్మ చెట్లను నీటి ఇద్దరికీ గురి చేయడం వల్ల కొమ్మల్లో పిండి పదార్థాల నిల్వ శాతం పెరుగుతుంది.ఆ తర్వాత 15 రోజులకు ఒకేసారి నీటిని, పోషకాలను అందించి కొమ్మలను చిగురించేలా చేయాలి.నిమ్మ తోటలకు అందించాల్సిన పోషక ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే.
జూన్ నెలలో 50 పి.పి.యం జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని, సెప్టెంబర్ లో 100పి.పి.యం సైకొలస్ ద్రావణాన్ని, అక్టోబర్ లో 10గ్రాముల పొటాషియం నైట్రేట్ ను ఒక లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారి చేయాలి.
![Telugu Cattle Manure, Yields, Lemon Crop, Lemon, Lemon Farmers, Lemon Trees, Pes Telugu Cattle Manure, Yields, Lemon Crop, Lemon, Lemon Farmers, Lemon Trees, Pes](https://telugustop.com/wp-content/uploads/2024/03/Tips-of-high-yields-and-pest-control-in-lemon-cultivation-detailsd.jpg)
నవంబర్ రెండవ వారంలో ఒక్కొక్క చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు,( Cattle Manure ) రెండు కిలోల వేపపిండి, 500 గ్రాముల యూరియా, 400 గ్రాముల మ్యురెట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్ల పాదుల్లో వేసి నీటి తడులు అందించాలి.ఎరువులు వేసిన 15 రోజులకు చెట్లు చిగురించి పూత రావడం మొదలవుతుంది.ఇక వేసవికాలంలో కాయ పరిమాణం, రసం తక్కువగా ఉంటుంది కాబట్టి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఎండ తీవ్రత వల్ల కాయ పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది కాబట్టి ఒక లీటర్ నీటిలో పది గ్రాముల యూరియాను కలిపి పిచికారి చేయాలి.ఇలా చేస్తే వేసవికాలంలో నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.