Dosa Crop : వేసవికాలంలో దోస పంట సాగు చేస్తే శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ..!

వేసవికాలంలో రైతులు దోస పంట సాగు( Cultivation of Dosa crop ) చేస్తే తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు.ఎందుకంటే.

 If Dosa Crop Is Cultivated In Summer The Labor Is Less And The Income Is More-TeluguStop.com

దోస పంట సాగుకు రసాయన ఎరువుల( Chemical fertilizers ) వినియోగం ఉండదు.కాబట్టి ఈ పంట సాగుకు పెట్టుబడి వ్యయం చాలా అంటే చాలా తక్కువ.

దోస పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే.సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించాలి.

పొలంలో కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి.అంతే మంచి దిగుబడి పొందవచ్చు.

తక్కువ నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవచ్చు.

తెగులు నిరోధక మేలురకం విత్తనాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరాకు 1.5 కిలోల విత్తనాలు( seeds ) అవసరం.విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల థైరం( Thyrum ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక ఒక ఎకరాకు ఐదు టన్నుల పశువుల ఎరువు ( cattle manure )తో పాటు పది కిలోల బోరాన్ ను వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.

మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.అప్పుడే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పొలంలో కలుపు సమస్య ఉంటే వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

కాబట్టి కలుపు ఎప్పటికప్పుడు తొలగిస్తే దాదాపుగా పెట్టుబడి వ్యయం తగ్గినట్టే.నేలలోని తేమ సుభావాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.దోస పంట విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది.ఇక వారానికి రెండు కోతలు తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube