బీజేపీ నేత గూడురు నారాయణ రెడ్డికి( Gudur Narayana Reddy ) సీఆర్పీఎఫ్ భద్రత( CRPF Security ) కల్పించారు.గూడూరు నారాయణ రెడ్డి ఇటీవల రజాకార్ సినిమాకు( Razakar Movie ) నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
రజాకార్ సినిమా నిర్మించినప్పటి నుంచి నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు తనకు సుమారు 1,100 బెదిరింపు కాల్స్ వచ్చాయని నారాయణ రెడ్డి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నారాయణ రెడ్డి కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం గూడూరు నారాయణ రెడ్డి 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పించింది.