సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత( Samantha ) ఒకరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి సమంత ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈమె మయోసైటిసిస్( Myositis ) వ్యాధికి గురి కావడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చి ఈ వ్యాధి చికిత్స కోసం వివిధ దేశాలకు వెళ్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ వ్యాధి నుంచి బయటపడినటువంటి ఈమె త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.
ఇకపోతే తాజాగా సమంత ముంబైలో అమెజాన్ ఈవెంట్ నిర్వహించగా సిటాడెల్( Citadel ) సిరీస్ యూనిట్ అంతా పాల్గొన్నారు.అయితే ఈ ఈవెంట్ కి సమంత ఓ కొత్త రకం డ్రెస్ తో వచ్చింది.పక్షి రెక్కల్లాంటి డిజైన్ తో చేసిన డ్రెస్ ని వేసుకుంది సమంత.ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేయించినటువంటి ఈ డ్రెస్ వేసుకొని ఈమె అందాలన్నింటిని ఆరబోస్తూ కనిపించారు.
బ్రా లేకుండా వివిధ భంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈమె ఫోటోషూట్ చేయించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ డ్రెస్ చూస్తుంటే అచ్చం పక్షి రెక్కలా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇదేం డ్రెస్సెస్ సమంత ఇలా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి సమంత ఇలా హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండడంతో ఈమె పూర్తిగా తన వ్యాధి నుంచి కోలుకున్నారని తెలుస్తోంది.ఇక త్వరలోనే సమంత తిరిగి సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.