Bangladesh Rickshaw : వీడియో వైరల్: జుగాడ్ తో వావ్ అనిపిస్తున్న బంగ్లాదేశ్ రిక్షావాలా..!

సోషల్ మీడియా( Social media ) పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలోనే విషయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది.ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Video Viral Bangladeshi Rickshawala That Looks Wow With Jugad-TeluguStop.com

ఇందులో కొన్ని రకాల వింతలు విశేషాలు, జంతువులకు సంబంధించి, ఇంకా కొన్ని ఫన్నీ వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉంటాం.మామూలుగా జుగాడ్ విషయంలో భారత్ కు సాటి ఎవరు రారని చెప్పవచ్చు.

కాకపోతే తాజాగా బంగ్లాదేశ్( Bangladesh ) రిక్షా కార్మికులు చేసిన జుగాడ్ చూస్తే వావ్ అనాల్సిందే.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెళితే.

బంగ్లాదేశ్ దేశానికి చెందిన కొందరు రిక్షావాలాలు వారి రిక్షాలను ఒకదాని వెంట ఒకటి కట్టుకొని వెళ్లడం గమనించవచ్చు.ఈ వీడియోలో మొదటి వ్యక్తి మామూలుగా రిక్షా తొక్కుతుండగా.ఆ తర్వాత కొన్ని రిక్షాలను ఆ రిక్షాను అనుసరించి ఒకదాని వెంట ఒకటి దూసుకుపోతున్నాయి.

ఇందులో రెండో రిక్షా ముందు టైర్ మొదటి రిక్షా యొక్క వెనుక భాగంలో ఉంచగా అలాగే మిగతా రిక్షాలు కూడా వాటి ముందరి టైర్లను ముందున్న రిక్షా పై ఉంచి ముందుకు సాగుతున్నారు.ఇలా కొన్ని రిక్షాలు ఒకే వరుసలో జుగాడ్ చేయడం మనకు కనపడుతుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో ఉంచగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోకి లక్షల సంఖ్యలో లైక్స్ రావడమే కాకుండా వేల సంఖ్యలో కామెంట్స్ వర్షం కురుస్తోంది.

ఇక కామెంట్స్ విషయానికి వస్తే.భారత్( Rickshaw ) లో మొదలైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సెల్ఫ్ డ్రైవింగ్ కోచ్ లను బంగ్లాదేశ్ లో మొదలుపెట్టిందా.? అంటూ కొందరు అనగా.మరికొందరైతే బ్రేకులు వేయాలంటే ఎలా వేస్తారు అంటూ వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి మీకు తోచిన కామెంట్ చేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube