ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లు నటిస్తున్నారు.అయితే హీరోయిన్లకు ఈ మధ్యకాలంలో పోటీ విపరీతంగా పెరిగిపోతోంది.
కొత్త కొత్త వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండడంతో హీరోయిన్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.అందుకు తగ్గట్టుగానే హీరోయిన్లు రెమ్యూనరేషన్ ను( Heroines Remuneration ) అందుకుంటున్నారు.
మరి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ ఎవరెవరు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి( Anushka Shetty ) ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది.

అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు గాను మూడు కోట్లు పారితోషికం అందుకుంటుంది.బుట్ట బొమ్మ పూజ హెగ్డే( Pooja Hegde ) ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి 4 కోట్ల రూపాయలు అందుకుంటోంది.టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటోంది.ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తున్న యంగ్ హీరోయిన్ శ్రీ లీలా( Sreeleela ) ఒక్కో సినిమాకు రూ.1.50 కోటి వరకు తీసుకుంటోందట.నిధి అగర్వాల్( Nidhi Agarwal ) కూడా ఒక్కో సినిమా కూడా రూ.కోటి వరకు అందుకుంటోంది.

హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) ఒక్కొక్క సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటోంది.అలాగే కాజల్ అగర్వాల్ కూడా రెండు కోట్లకు పైగా పారీతోషికాన్ని అందుకుంటోంది.అలాగే టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు కోటి వరకు అందుకుంటోంది.బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గేమ్ ఛేంచర్ కోసం రూ.3 కోట్ల వరకు అందుకుంది.హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కొక్క సినిమాకు గాను 70 లక్షల వరకు పారితోషికాన్ని అందుకుంటుంది.