సాధారణంగా ఇండియాలో చాలా సినిమాలకు సరైన కథ అసలు ఉండదు.ముందుగా హీరో ఎంట్రీ ఇస్తాడు, విలన్లను చితక బాదుతాడు.
తర్వాత పాటలు, ఆపై కామెడీ ఇలా ఒక మూసా ధోరణిలో మూవీ కథలు సాగుతుంటాయి.ఒకవేళ దీనికి భిన్నంగా ఒక మంచి కథ చెప్పడానికి ట్రై చేసినా నిర్మాతలు( Producers ) మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు అసలు ఆసక్తి చూపించరు.
వాస్తవానికి ఇండియన్ మూవీలో లాజిక్‌లనేవి( Logics ) అసలే ఉండవు.వాహనాల కింద నుంచి రైడ్ చేయడం, ఒక్క తన్ను తంతే చాలా దృఢమైన, బలంగా ఉండే రైల్వే బోగీ డోర్లు ఊడిపోవడం, తొడగొడితే సిలిండర్లు పేలిపోవడం వంటి లాజిక్ అందని సీన్లు ఎన్నో ఇండియన్ సినిమాల్లో జొప్పిస్తుంటారు.
సినిమాల్లో ఇలాంటి తిక్క యాక్షన్ సన్నివేశాలు ఎన్ని పెట్టినా కొంతమంది ప్రేక్షకులు వాటిని చూసేందుకు ఇష్టపడతారు.

అలాంటి సన్నివేశాలతో వచ్చి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.రాజకీయాలు విషయానికొస్తే ఇలాంటి స్టంట్స్ చేయడం కుదరదు కాబట్టి హీరోలు వాటి జోలికి వెళ్లడానికి ధైర్యం చేయరు.కొంతమంది పాలిటిక్స్ లోకి( Politics ) ఆల్రెడీ వెళ్లి చేతులు కాల్చుకున్నారు.
ఇక సినిమాల్లో ఫిజిక్స్ ని( Physics ) ఎవడూ పాటించడు.భౌతిక శాస్త్రం అనేది ఒకటి ఉందని, మనిషికి కొన్ని మాత్రమే సాధ్యమవుతాయనే ఆలోచనే వారి బుర్రలకు రాదు.
ముసలోళ్ళు, 80 కిలోల బరువు ఉన్నోళ్లు కూడా గాల్లో ఎగిరేస్తూ రౌడీలను తన్నేస్తూ షాక్‌లిస్తుంటారు.ప్రతి హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయని, వారు దైవాంశ స్వరూపులు అన్నట్లుగా ఇండియన్ సినిమాల్లో( Indian Movies ) చూపిస్తుంటారు.
ఒక్కోసారి హీరో తంతే విలన్లు కరెంటు స్తంభం ఎత్తుకెగిరి ఎలక్ట్రిక్ షాక్ కి గురవుతుంటారు.అంత ఎత్తుకు తన్నడం ఏ మనిషికీ సాధ్యం కాదు.
అయినా ఇలాంటి సన్నివేశాలను దర్శకులు చాలా ఈజీగా రూపొందిస్తుంటారు.

అయితే ఇలాంటి చెత్త సినిమాలను దర్శక నిర్మాతలు బహిరంగంగానే వెనకేసుకొస్తారు.జనాలకి ఏది నచ్చితే అదే తీస్తున్నాం అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు.ఈ ధోరణి ఇటీవల కాలం నుంచి కాదు ఏఎన్ఆర్,( ANR ) ఎన్టీఆర్( NTR ) ఉన్న సమయం నుంచి ఇలాంటి కథలేని సినిమాలు వచ్చి విజయాలు సాధిస్తూనే ఉన్నాయి.
నాలుగు మంచి పాటలు, కామెడీ, ప్రేమ, మారు వేషాలు వేసే సస్పెన్స్ సీన్లు యాడ్ చేసి అప్పట్లో దర్శకులు హిట్స్ కొట్టారు.నిజానికి జనాలు ఏ సినిమాని హిట్ చేస్తారో ఎవరూ ఊహించలేని పరిస్థితి.
దర్శకులు కూడా తమకు నచ్చినట్టు సినిమాలు తీసి వదిలేస్తుంటారు.మొత్తం మీద ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఇప్పటికీ కథ లేని సినిమాలు ఏలుతున్నాయి.