మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ఒకరు.ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈయన మలయాళం లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు సీతారామం ( Sitaramam ) సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినటువంటి దుల్కర్ అనంతరం ఎన్నో సినిమాలలో క్యామియో రోల్స్ చేశారు.ఇలా పలు భాష చిత్రాలలో నటిస్తూ ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు.ఈ విధంగా 12 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా లక్కీ భాస్కర్ ( Lucky Baskar ) నుండి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.మగధ బ్యాంక్( Magadha Bank )లో క్యాషియర్‌గా పని చేస్తున్న లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నారు.80ల కాలం నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి, ఈ సినిమా అంతా ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం గురించి అని నిర్మాతలు తెలుపుతున్నారు.ఇక ఈ సినిమా నుంచి ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamshi )), సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.