జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన గెటప్ శ్రీను( Getup Srinu ) హనుమాన్ సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.గెటప్ శ్రీను యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే గెటప్ శ్రీను కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.రాజు యాదవ్( Raju Yadav ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్నారు.
పాత్రకు అనుగుణంగా లుక్ ను మార్చుకునే విషయంలో గెటప్ శ్రీను ముందువరసలో ఉంటారు.మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో గెటప్ శ్రీనుకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.గెటప్ శ్రీను ఇన్నేళ్లలో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఉంటారని చాలామంది ఫీలవుతారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను మాట్లాడుతూ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చేశారు.
![Telugu Getup Srinu, Jabardasth, Jabardasthgetup, Raju Yadav-Movie Telugu Getup Srinu, Jabardasth, Jabardasthgetup, Raju Yadav-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/jabardasth-comedian-getup-sreenu-assets-value-details-here-goes-viral-in-social-mediab.jpg)
జబర్దస్త్ షో వల్ల నాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని ఆయన అన్నారు.ఇంటిని కొనుగోలు చేసినా ప్రతి నెలా వాయిదాలు చెల్లించాలని గెటప్ శ్రీను వెల్లడించారు.కారు కూడా ఉందని కారు కూడా వాయిదాలలో కొనుగోలు చేశానని ఆయన కామెంట్లు చేశారు. పెద్దపెద్ద బంగ్లాలు కొనుగోలు చేయాలని, బీ.ఎం.డబ్ల్యూ కారును కొనుగోలు చేయాలని నేను భావించనని ఆయన చెప్పుకొచ్చారు.
![Telugu Getup Srinu, Jabardasth, Jabardasthgetup, Raju Yadav-Movie Telugu Getup Srinu, Jabardasth, Jabardasthgetup, Raju Yadav-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/jabardasth-comedian-getup-sreenu-assets-value-details-here-goes-viral-in-social-mediac.jpg)
నాకు ఉన్నదానితో నేను సంతృప్తి పడతానని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు.డబ్బు ఒత్తిడితో పని చేస్తే మంచి సినిమాలను ఎంచుకోలేమని ఆయన పేర్కొన్నారు.రామ్ ప్రసాద్, సుధీర్ లను నేను మిస్ కానని గెటప్ శ్రీను అన్నారు.గెటప్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హీరోగా కూడా గెటప్ శ్రీను సక్సెస్ సాధిస్తే ఆయన కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి.