అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్త జ్వాలలు చెలరేగాయి.పార్టీ అధిష్టానం కొత్తగా నియమించిన సమన్వయ కర్త, ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన సెగ తగిలింది.
ఈ క్రమంలోనే ఎంపీ గొడ్డేటి మాధవికి సహకరించబోమని అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాల్గుణ వర్గీయులు చెబుతున్నారు.ఎంపీ మాధవి స్థానిక వ్యక్తి కాదంటున్న ఎమ్మెల్యే అనుచరవర్గం ఆమె భర్త ఎస్టీ కాదని వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే అనుచరుల నిరసనలతో అరకు వైసీపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.