ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని( Visa Processing Centre ) భారత్ మూసివేసింది.ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
అయితే భారత్ వీసాలను నిలిపివేయడంతో అత్యవసర పనుల నిమిత్తం మనదేశానికి రావాల్సిన కెనడియన్లు, ప్రవాస భారతీయులు , వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై భారీగా ఫిర్యాదులు సైతం రావడంతో కేంద్ర విదేశాంగ శాఖ , కెనడాలోని( Canada ) ఇండియన్ హైకమీషన్ స్పందించింది.కెనడాలో నిలిపివేసిన అన్ని రకాల వీసా సేవలను అక్టోబర్ 26 నుంచి పున: ప్రారంభించనున్నట్లుగా తెలిపింది.ఆ తర్వాత నవంబర్ 22న ఈ వీసా సేవలను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కెనడాలో వీసా సేవల కోసం మరో మూడు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసింది.భారత ప్రభుత్వానికి ఔట్‌సోర్సింగ్ ద్వారా వీసా సేవలను అందిస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌కు( BLS International Services ) కెనడాలో 9 కేంద్రాలు వుండగా.
తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 12కు పెరిగింది.సస్కట్చేవాన్ ప్రావిన్స్ రాజధాని రెజీనా,( Regina ) నోవాస్కోటియా రాజధాని హాలిఫాక్స్,( Halifax ) గ్రేటర్ టొరంటో ఏరియా పరిధిలోని మిస్సిసాగా( Mississauga ) పట్టణంలో ఈ కొత్త కేంద్రాలు జనవరి 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాయి.
అపాయింట్‌మెంట్‌లు, వాక్ ఇన్‌ల ద్వారా పాస్‌పోర్ట్, వీసా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్స్, ధృవీకరణ దరఖాస్తులను ఈ కేంద్రాలు స్వీకరిస్తాయి.
ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ వీసా, కాన్సులర్ సేవలకు స్థిరమైన డిమాండ్‌ను బట్టి కెనడాలోని మరే ఇతర నగరంలోనైనా కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ తెలిపారు.ఇండో కెనడియన్ల జనాభాతో పాటు సేవలకు డిమాండ్ పెరిగిందని.5 ఏళ్ల క్రితం 1.8 మిలియన్లు వుండగా ఇప్పుడు అది సుమారు 2.4 మిలియన్లకు పెరిగిందని వర్మ పేర్కొన్నారు.భారత్ నుంచి కెనడాకు వలస వచ్చే వారి సంఖ్య పెరగడంతో కాన్సులర్ సేవలకు డిమాండ్ పెరుగుతోందన్నారు.