లక్ అంటే ఇదే..!  బీఆర్ఎస్ కు కలిసి రాబోతున్న ఆ పథకం ! 

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రస్తుత పరిస్థితి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూల పవనాలు లేవనే సర్వే నివేదికలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి.

 Luck Is This The Rythu Bandhu Scheme That Is Going To Come Together With Brs ,-TeluguStop.com

దీనికి తోడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన సర్వే రిపోర్ట్ తో మరింత కంగారు మొదలైంది.మూడోసారి విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదల బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ లో కనిపించినా,  క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రశాంతి కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం రిపోర్ట్ ఇచ్చింది.

ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం కేసీఆర్,  కేటీఆర్( KCR, KTR ) తో భేటీ అయ్యి  ప్రశాంత్ కిషోర్ చర్చించారు.పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తేల్చి చెప్పారు.

దీంతో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై విశ్లేషణ చేసుకున్నారు.

Telugu Central, Congress, Rythu Bandhu, Rythubandhu, Telangana, Telangana Bjp-Po

 ప్రజలలో ఆదరణ పెంచుకునేందుకు బీఆర్ఎస్( BRS ) చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు.ఎన్నికల్లో కేసీఆర్,  కేటీఆర్ , హరీష్ రావు,  కవిత తో పాటు , ఇతర కీలక నాయకులంతా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం  వంటివి మరింత టెన్షన్ పెడుతోంది.

ఈ సమయంలోనే  ఇప్పుడు బీ ఆర్ ఎస్ కు కాస్త ఊరట లభించింది.రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం తో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు( Rythu Bandhu ) నిధుల విడుదలను మొదలుపెట్టింది.

దీంతో రైతుల ఖాతాల్లో నిధులు విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.రైతుల అకౌంట్లో డబ్బులు పడనున్నాయి.

Telugu Central, Congress, Rythu Bandhu, Rythubandhu, Telangana, Telangana Bjp-Po

కీలకమైన ఎన్నికల పోలింగ్ సమయంలో రైతుల ఖాతాల్లో సొమ్ములు పడితే అది బీఆర్ఎస్ కు ఎంతగానో కలిసి వస్తుంది.ప్రస్తుతం ఎన్నికల సమయంలో తమకు ఎంతగానో మేలు చేస్తుంది అని బీ ఆర్ ఎస్ అంచనా వేస్తోంది.  రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇవ్వాలని,  తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.ఇది పాత పథకం కావడంతో,  రైతుబంధు సాయం పంపిణీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అనుమతి ఇచ్చారు.

ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube