స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో.
సెమీస్ అర్హత సాధించే దిశగా ఆడలేకపోయింది.దీంతో సెమీస్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆల్రెడీ అంతకుముందు న్యూజిలాండ్ తో భారత్ ఒక మ్యాచ్ ఆడగా విజయం సాధించింది.ఇంకోపక్క ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ నాలుగు టీమ్స్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టుగా ఇండియా టోర్నీలో రాణించింది.
ఇదిలా ఉంటే గత ఏడాది టి20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్స్ లో భారత్ ఓటమి చెందడంతో.పాకిస్తాన్ క్రికెట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో.బైబై ఇండియా అంటూ ఎటకారం చేస్తూ పోస్టులు పెట్టడం జరిగింది.కాగా ఇప్పుడు పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగడంతో.భారత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ టీంని గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు.పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఫోటో పోస్ట్ చేసి జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి అంటూ.షేర్ చేస్తున్నారు.టి20లో ఇండియా ఓడిపోయిన సమయంలో పాకిస్తాన్ చేసిన ట్రోలింగ్ కి ఇప్పుడు సరిగ్గా.భారత్ క్రికెట్ ఫ్యాన్స్.
పాకిస్తాన్ నీ ట్రోల్స్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు.