సినిమా ఇండస్ట్రీలో చిత్రవిచిత్రాలు జరుగుతూ ఉంటాయి.కొన్నిసార్లు ఇది ఏమవుతుందిలే అనుకొని చిన్నపాటి నిర్లక్ష్యంతో చేసే పనులు పెద్ద మార్పులకు కారణమవుతాయి.
అలా తెలిసి తెలియక కొన్నిసార్లు చేసిన పొరపాట్ల వల్ల లీగల్ గా ప్రాబ్లమ్స్( Legal Problems ) ఎదుర్కొనే సినిమాలు కూడా ఉంటాయి.అలా లీగల్ ఇష్యూస్ వచ్చి పోలీసు వారు హెచ్చరించడంతో కొన్ని సినిమాల్లోంచి ముఖ్యమైన సన్నివేశాలను, పాటలను తొలగించాల్సి వచ్చింది.మరి ఆ ముఖ్యమైన విషయాలను తొలగించిన సినిమాలు ఏంటి? ఎందుకు అలా జరిగిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంకురం
ఈ సినిమా 1992లో విడుదల కాగా దీనికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి.అలాగే ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు( Nandi Award ) కూడా దక్కాల్సి ఉండగా పోలీసు ఉన్నతాధికారులు దాని నిలిపివేశారు.ప్రభుత్వానికి పోలీసు వారు ఒక లేఖ రాశారు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పై( Police System ) ఎంతో ప్రభావం చూపించే విధంగా ఈ చిత్రం ఉందని, పోలీసుల గౌరవాన్ని తగ్గిస్తుందని అందువల్ల ఇలాంటి ఒక సినిమాకు అవార్డు ఇవ్వడం అనేది మంచిది కాదు అని వారి అభిప్రాయాన్ని తెలియజేయడంతో ఆ సంవత్సరం ప్రభుత్వం ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును ఇవ్వలేదు.
జయం
తేజ దర్శకత్వంలో నితిన్( Nithin ) మరియు సదా( Sadha ) హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం 2002లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో రైలు బండి అని ఒక పాట ఉంటుంది.ఈ పాట ఎంతగానో ఫేమస్ అయ్యింది.అయితే ఈ పాట థియేటర్లో రిలీజ్ అయినప్పుడు బాగానే ఉంది.అలాగే విడుదల చేసినప్పుడు కూడా మంచి విజయాన్ని సాధించింది.కానీ ఆ తర్వాత సినిమా టీవీలో వచ్చేసరికి అందులోని ఈ రైలు బండి పాటను కట్ చేసి విడుదల చేశారు.
దానికి గల కారణం రైల్వే శాఖ ( Railway Department ) ఈ పాటపై అభ్యంతరం తెలపడం.ఎందుకంటే బండి బండి రైలు బండి అది వేలకంటూ రాదు అంటూ దాన్ని నమ్ముకుంటే అంతే అంటూ కొన్ని పదాలు ఉండడం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ మనోభావాలు దెబ్బతిన్నాయి.
రాపిడో యాడ్
ఇది చాలా రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన.2021లో రాపిడో( Rapido ) లాంచ్ అయిన కొత్తలో అల్లు అర్జున్( Allu Arjun ) దీనిపై ఒక ప్రకటనలో నటించారు.సాధారణ బస్సులు అంటే ఏదో దోశల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటారని, అందువల్ల ర్యాపిడో వాడాలని, అదే సురక్షితమని కొన్ని అభ్యంతరమైన పదాలు చెప్పడంతో ఆర్టీసీ( RTC ) వారు లీగల్ గా నోటీసులు విడుదల చేయడంతో ఆ తర్వాత ఈ యాడ్ కనిపించలేదు.దీనిపై అప్పటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్( RTC MD Sajjanar ) కాస్త తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తపరిచారట.
ఇలా పలు సందర్భాల్లో కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా ముఖ్యమైన మరియు అవసరమైన వాటిని కూడా పక్కకు పెట్టాల్సి వచ్చింది.కానీ ఇలాంటివి తీసేముందు కాస్త జాగ్రత్తలు పాటిస్తే మన మేకర్స్ మరో లెవెల్ లో తమ సినిమాను ప్రజలు చేసుకుని అవకాశం ఉంటుంది.