కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న సీనియర్ నేత వీ.
హనుమంతరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎవరికి వారే తానే సీఎం అంటున్నారని వీహెచ్ అన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి నేనే అనుకోవడం, అనడం మానేయాలని సూచించారు.కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.తనకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చి పోయిందన్న వీహెచ్ ముందు ఎన్నికల్లో గెలవాలని సూచించారు.తరువాత సీఎం పంచాయతీ పెట్టుకుందామని వెల్లడించారు.







