సిద్దిపేట జిల్లాలోని కొనాయిపల్లి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.కాగా ఈనెల 9వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ కు కోనాయిపల్లి వెంకన్న ఆలయం సెంటిమెంట్ కావడంతో ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు.కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు.