మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇటలీలో ఎంతో సందడి చేస్తున్నారో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) పెళ్లి వేడుకల సందర్భంగా వారం రోజులుగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలోనే ఉన్న సంగతి తెలిసిందే.ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ పెళ్లి వేడుకలలో రామ్ చరణ్ కుమార్తె క్లీన్ కారా ( Klin kaara ) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
అయితే ఈ చిన్నారి ఫోటోలు ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడినప్పటికీ అభిమానులు మాత్రం టెక్నాలజీని ఉపయోగించి చిన్నారి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే చిన్నారి ఫేస్ ఎక్కడ కనపడకుండా ఉపాసన ఎంత జాగ్రత్త పడుతూ వచ్చారు.తాజాగా తన కుమార్తె తన తాతయ్య నాన్నమ్మలతో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో భాగంగా సురేఖ ( Surekha ) చిరంజీవి ( Chiranjeevi ) ఎంతో అందంగా ముస్తాబయి తమ మనవరాలను చాలా ముద్దుగా ఆడిస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఉపాసన స్వీటేస్ట్ నాయనమ్మ చిరుత(చిరుతాత) అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇలా నానమ్మ తాతయ్యలతో చిన్నారి క్లీన్ కారా ఉన్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఉపాసన రాంచరణ్ పెళ్లయిన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారడంతో ఈ చిన్నారి అందరికీ ఎంతో ప్రత్యేకంగా నిలిచారు.
ఈమె జూన్ 20వ తేదీ జన్మించినప్పటికీ ఇప్పటివరకు తన ఫేస్ ఎలా ఉంది అనే విషయాన్ని రివిల్ చేయలేదు ఎక్కడ తన కుమార్తె ఫేస్ కనపడకుండా ఉపాసన చాలా జాగ్రత్త పడుతున్నారు.తాజాగా ఈమె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక కావడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా వీరి వివాహం పూర్తి అయింది.
త్వరలోనే ఇండియా మెగా హీరోలు అందరూ ఇండియా చేరుకొని ఇక్కడ హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.వరుణ్ పెళ్లి వేడుక నిమిత్తం మెగా హీరోలు అందరూ కూడా షూటింగులకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలా మెగా హీరోలు అందరూ ఒకే చోట చేరి వరుణ్ పెళ్లి వేడుకలలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.