అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత బండారు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.బండారు అస్వస్థతకు గురయ్యారని ఈ క్రమంలో అంబులెన్స్ లోపలికి పంపాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య చెలరేగిన వివాదంతో తోపులాట జరిగింది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే బండారుకు ఆరోగ్యం క్షీణించిందని, అంబులెన్స్ కు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.ఈ క్రమంలో బండారు నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.