హెయిర్ గ్రోత్( Hair growth ) లేదని బాధపడుతున్నారా.? ఉన్న జుట్టు ఊడిపోతుంది కానీ కొత్త జుట్టు రావడం లేదా.? రోజు రోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.? అయితే మీకు అల్లం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.హెయిర్ గ్రోత్ ను రెట్టింపు చేయడానికి అల్లం గ్రేట్ గా తోడ్పడుతుంది.ముఖ్యంగా అల్లంను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ జుట్టు కొద్ది రోజుల్లోనే డబుల్ అవ్వడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఒత్తైన జుట్టును పొందడానికి అల్లం ను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద అల్లం( Ginger ) ముక్క ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మరోసారి మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.
అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) మరియు అల్లం జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్( Hair growth ) చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం తగ్గుతుంది.మీ కురులు ఎంత పల్చగా ఉన్నా సరే ఈ రెమెడీ ని స్టార్ట్ చేశారంటే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పొడుగ్గా మారుతాయి.అలాగే ఈ రెమెడీ వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.
మరియు చుండ్రు సమస్య దూరం అవుతుంది.స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా సైతం మారుతుంది.