ఫేక్ మెసేజ్ లతో నగల వ్యాపారికి కుచ్చుటోపి..!

ఇటీవలే కొందరు చేసే మోసాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.మోసాలు చేయడంలో కొత్త కొత్త రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

 Delhi Jeweller Loses Nearly Rs 3 Lakh In New Fake Message Scam Details, Delhi Je-TeluguStop.com

కొందరు వ్యక్తులు కష్టపడకుండా డబ్బులు సంపాదించడం కోసం సరికొత్త అడ్డదారులను వెతుకుని చేస్తున్న ఘరానా మోసాలను చూసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు.ఇలాంటి కోవలోనే ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు ఫేక్ మెసేజ్( Fake Message ) పంపించి నగల వ్యాపారిని మోసం చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.

ఢిల్లీ నగరంలో( Delhi ) కిషోర్ ఖండేల్వాల్ అనే నగల వ్యాపారి దాదాపుగా 50 ఏళ్ల నుండి నగల వ్యాపారం( Jewelry Business ) చేస్తున్నాడు.ఈమధ్య ఇతని దుకాణానికి ఒక వ్యక్తి వచ్చి 15 గ్రాముల బంగారు గొలుసు కొంటానని ఆ గొలుసును ఆర్డర్ చేశాడు.

ఆ తర్వాత తాను షాప్ కు రాలేనని, ఖాతా వివరాలు చెబితే డబ్బులు జమ చేస్తానని చెప్పడంతో ఖండేల్వాల్ తన ఖాతా వివరాలను ఆ వ్యక్తికి పంపించాడు.కాసేపటికి ఖండేల్వాల్ ఖాతాలోకి రూ.93400 జమ అయినట్టు మొబైల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది.

Telugu Delhi, Delhi Jeweller, Message Scam, Jeweller, Loses, Messages Scam, Rs-L

అనంతరం ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాకు షాప్ యజమాని చైన్( Chain ) ఇచ్చి పంపించాడు.మళ్లీ మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి మరో 30 గ్రాముల బంగారు గొలుసు ఆర్డర్ చేశాడు.తర్వాత ముందు రోజు మాదిరిగానే వ్యాపారికి రూ.195400 ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ పంపించాడు.ఇక నగల వ్యాపారి ఆ చైన్ ను కూడా ఆ వ్యక్తి ఇంటికి పంపించాడు.

Telugu Delhi, Delhi Jeweller, Message Scam, Jeweller, Loses, Messages Scam, Rs-L

అయితే షాప్ యజమాని కాసేపటి తర్వాత ఫోన్లో స్టేట్మెంట్ చెక్ చేయగా డబ్బులు రాలేదని అర్థమైంది.ఫోన్ కు వచ్చిన మెసేజ్లను పరిశీలించగా అవి బ్యాంకు నుండి వచ్చిన మెసేజ్లు కాదని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు.ఈ విషయంపై బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.ఈమధ్య చాలాచోట్ల పలువురు వ్యాపారులు ఇలాంటి మోసాలకు గురవుతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube