భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన వనమా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వనమా పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తన ఎన్నిక చెల్లదంటూ ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది.ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే జలగం వెంకట్రావు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు వనమా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.