బి అలెర్ట్ - గురువారం, శుక్రవారాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి

గురువారం, శుక్రవారం రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

 Be More Alert On Thursday And Friday, Sp Akhil Mahajan, Collector Anurag Jayanth-TeluguStop.com

జిల్లాలో ఈ నెల 27, 28 తేదీలలో భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై గురువారం సాయంత్రం జిల్లా అదనపు కలెక్టర్ లు , RDO లు , అన్నీ ప్రభుత్వ జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దార్ లు, ఎంపిడివో లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ( SHO) లతో ఎస్పి అఖిల్ మహాజన్ తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ నేడు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సీరియస్ గా దృష్టి పెట్టీ సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

నిన్నటి నుంచే జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ లోనే ఉంటూ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపలన్నారు.మండల తహశీల్దార్ లు, ఎంపిడివో లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ( SHO) లు తమ మండల పరిధిలో చెరువుల నీటి మట్టాల ను గమనిస్తూ ఉండాలన్నారు.

తెగిపోయే అవకాశం ఉంటే ప్రభావిత ప్రాంతాల ప్రజల ను అప్రమత్తం చేయాలన్నారు.

చెరువులు, వాగులు, వంకల్లో ప్రజలు ఈతకు వెళ్లకుండా క్షేత్ర అధికారుల సహాయంతో చూడాలన్నారు.

మత్య కారులను చేపల వేటకు వెళ్లకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.గొఱ్ఱెల కాపరులు కూడా నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

చెరువులు, లో లెవెల్ వంతెనలు, స్ట్రీమ్ లు వెళ్లే మార్గాలలో రాకపోకలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.బ్యారికెడ్లు, హెచ్చరిక ఫ్లెక్సీ లు పెట్టాలన్నారు.24 గంటలు అక్కడే ఉంటూ నిఘా ఉండేలా పంచాయితీ సిబ్బందికి డ్యూటీ వేయాలన్నారు.గ్రామాలు, ఆవాసలకు భారీ వర్షాల వల్ల రాకపోకలు నిలిచిపోయిన చోట డయాలసిస్, క్యాన్సర్ రోగులకు వైద్య సహాయం అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలనీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ను అదేశించారు.8 నెలలు నిండిన గర్భిణులను సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలన్నారు.గ్రామాలకు త్రాగునీటి సరఫరా కు అంతరాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

క్వాలిటీ రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా మిషన్ భగీరథ అధికారులు మానిటర్ చేయాలని చెప్పారు.

శిథిలావస్థలో, ప్రమాదకరం ఉన్న ఇండ్లలో ఉన్న వారినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని అన్నారు.

లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని అన్నారు.సిరిసిల్ల లోని మానేరు , వేములవాడ పట్టణంలో నీ మూల వాగు బండ్ వద్ద 24 గంటలు పాటు పర్యవేక్షణ ఉండేలా మున్సిపల్ అధికారులు డ్యూటీలు వేయాలన్నారు.

పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీలను పెంచాలన్నారు.

బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోనీ చెరువు ఓవర్ ఫ్లో అయ్యేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడ ఇరిగేషన్ ఏఈని రాత్రిపూట కూడా ఉంటూ పర్యవేక్షణ చేసేలా చూడాలని జిల్లా ఇరిగేషన్ అధికారినీ కలెక్టర్ ఆదేశించారు.

ఇసుక సంచులు కూడా సిద్దం చేసుకోవాలన్నారు.రాకపోకలు లేని ఫాజుల్ నగర్, వట్టెంల, శా త్రా జు పల్లి, హన్మజి పేట గ్రామాల ప్రజలకు అత్యవసరం వైద్య సహాయం అందేలా జిల్లా వైద్యాధికారి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

నీటి ప్రవాహాలు , కాజ్ వే లు ఉన్న అన్ని గ్రామాలలో నైట్ డ్యూటీ లు వెంటనే వేయాలన్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…చెరువులు, జలాశయాల్లోకి మత్యకారులు వేటకు వెళ్లకుండా, అలాగే గొర్రె కాపరులు నీటి ప్రవాహాల చెంతకు వెళ్లకుండా ఆ కమ్యూనిటీ ప్రజలను కలిసి చెప్పాలన్నారు.

జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

టెలీ కాన్ఫరెన్స్ లో

1.CEO-ZP & MPDOs
2.DPO
3.MC-sircilla & MC-Vemulawada
4.EE R&B, EE PR,
5.EE Irrigation (Dvn.7&8)
6.DM&HO
7.DM RTC
8.RDO sircilla, RDO vemulawada and Tahsildars
9.Fisheries officer
10.MD CESS
11.CPO
12.DPRO
13.D Supdt
14.

Fire Officer లు
తహశీల్దార్ లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube