తమ పనైపోయిందనుకుంటున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ లా అందిన విజయం ఆ పార్టీకి వెయ్యి ఏనుగులు బలం తీసుకొచ్చింది .గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు కర్ణాటక విజయం ఏ స్థాయిలో ఊపిరి అందించిందో చెప్పనవసరం లేదు.
అని రకాలుగా బలమైన భాజపా ను కలిసికట్టుగా ఢీకొట్టిన కర్ణాటక సూత్రాన్ని మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తుంది .నేతల మధ్య సఖ్యత, అద్భుతమైన వ్యూహాలు అవసరమైన ఆర్థిక వనరులు, కర్ణాటక ఎన్నికలలో( Karnataka elections ) కాంగ్రెస్ విజయానికి మూల సూత్రాలు ఇవే ఈ మూడు విషయాలలోనూ కీలకంగా పనిచేసిన వ్యక్తి మాత్రం కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన ఈయన అనేక కీలక సమయా లలో పార్టీకి అండగా నిలబడ్డారు.
![Telugu Shivakumar, Karnataka, Priyanka Gandhi, Revanth Reddy, Sharmila, Ts-Telug Telugu Shivakumar, Karnataka, Priyanka Gandhi, Revanth Reddy, Sharmila, Ts-Telug](https://telugustop.com/wp-content/uploads/2023/06/congress-Priyanka-Gandhi-Revanth-Reddy-telanagana-congress-ts-politics-D.-K.-Shivakumar.jpg)
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సంపాదించి పెట్టే బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను శివకుమార్‌కు అప్పచెప్పాలని ,ఆయన సూచనల ప్రకారం వ్యూహాలు అమలు చేయాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడికి సూచనలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి .ఈ దిశగా ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు ఇటీవల కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కూడా డీకే శివకుమార్‌తో( D.K.Shivakumar ) భేటీ అయ్యారని ,తెలంగాణలో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించారని తెలుస్తుంది.
![Telugu Shivakumar, Karnataka, Priyanka Gandhi, Revanth Reddy, Sharmila, Ts-Telug Telugu Shivakumar, Karnataka, Priyanka Gandhi, Revanth Reddy, Sharmila, Ts-Telug](https://telugustop.com/wp-content/uploads/2023/06/Priyanka-Gandhi-Revanth-Reddy-telanagana-congress-kcr-brs-ts-politics.jpg)
ఇక టీ కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న షర్మిలా కూడా వివిధ దశల్లో శివకుమార్ ని కలిసి వచ్చారు .తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరును రూపుమాపడానికి డీకే తీసుకునే చర్యలు ఫలితాన్ని ఇస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది .బలమైన భాజాపాను ఢీకొట్టిన నేతగా పేరు ఉన్న ఈయన తెలంగాణలో కూడా బారాసా వంటి బలమైన పార్టీని ఢీ కొట్టి కాంగ్రెస్‌కు విజయం అందిస్తారని నమ్మకంతో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి డీకే మంత్రం తెలంగాణలో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి
.