కర్ణాటక మంత్రం జపిస్తున్న టీ -కాంగ్రెస్!

తమ పనైపోయిందనుకుంటున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ లా అందిన విజయం ఆ పార్టీకి వెయ్యి ఏనుగులు బలం తీసుకొచ్చింది .

గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్కు కర్ణాటక విజయం ఏ స్థాయిలో ఊపిరి అందించిందో చెప్పనవసరం లేదు.

అని రకాలుగా బలమైన భాజపా ను కలిసికట్టుగా ఢీకొట్టిన కర్ణాటక సూత్రాన్ని మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తుంది .

నేతల మధ్య సఖ్యత, అద్భుతమైన వ్యూహాలు అవసరమైన ఆర్థిక వనరులు, కర్ణాటక ఎన్నికలలో( Karnataka Elections ) కాంగ్రెస్ విజయానికి మూల సూత్రాలు ఇవే ఈ మూడు విషయాలలోనూ కీలకంగా పనిచేసిన వ్యక్తి మాత్రం కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన ఈయన అనేక కీలక సమయా లలో పార్టీకి అండగా నిలబడ్డారు.

"""/" / ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సంపాదించి పెట్టే బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను శివకుమార్కు అప్పచెప్పాలని ,ఆయన సూచనల ప్రకారం వ్యూహాలు అమలు చేయాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడికి సూచనలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి .

ఈ దిశగా ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు ఇటీవల కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కూడా డీకే శివకుమార్తో( D.

K.Shivakumar ) భేటీ అయ్యారని ,తెలంగాణలో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించారని తెలుస్తుంది.

"""/" / ఇక టీ కాంగ్రెస్తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న షర్మిలా కూడా వివిధ దశల్లో శివకుమార్ ని కలిసి వచ్చారు .

తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరును రూపుమాపడానికి డీకే తీసుకునే చర్యలు ఫలితాన్ని ఇస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది .

బలమైన భాజాపాను ఢీకొట్టిన నేతగా పేరు ఉన్న ఈయన తెలంగాణలో కూడా బారాసా వంటి బలమైన పార్టీని ఢీ కొట్టి కాంగ్రెస్కు విజయం అందిస్తారని నమ్మకంతో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరి డీకే మంత్రం తెలంగాణలో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి .

కోటీశ్వరుడే.. భార్య బర్త్‌డే కోసం ఏం గిఫ్ట్ తెచ్చాడో చూస్తే మాత్రం..??