ఎప్పటి నుంచో ఏపీలో పాగా వేయాలని కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ప్రయత్నాలు చేస్తున్నా, ఆ ఆశ తీరడం లేదు.సొంతంగా బిజెపి ఎన్నికల్లో పోటీ చేసే ఒక స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితి ఉంది.
ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలోనే ఒకటి , రెండు స్థానాలను దక్కించుకోగలుగుతోంది.ఏపీ మాదిరిగానే తెలంగాణలోని బిజెపి పరిస్థితి ఒకప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నా, ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.
అక్కడ బిజెపి నాయకులు అంతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం, బిజెపి అగ్ర నాయకులు సైతం తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇది సాధ్యమైంది.కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఇక్కడ అధికార పార్టీగా ఉన్న వైసీపీకి పరోక్షంగా బిజెపి కేంద్ర ప్రజలు సహకారం అందిస్తూ ఉండడం వంటివి ఏపీ బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారాయి.

ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై స్థానిక నాయకులు ఆందోళనలు, పోరాటాలు చేపడుతున్న, ప్రజల్లో మాత్రం స్పందన కనిపించడం లేదు.దీనికి కారణం కేంద్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందుతుందటమే.దీంతో బిజెపి , వైసిపి ఒక్కటేనన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడం వంటివి ఏపీలో బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.
దీంతో పాటు ఏపీ బీజేపీ నేతల్లోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఒక వర్గం పై చేయి సాధించకుండా మరో వర్గం ప్రయత్నాలు చేయడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.ఒక వర్గం వైసీపీకి అనుకూలంగా ఉండగా , మరో వర్గం వ్యవహరిస్తుండడం వంటివన్నీ బిజెపి పై ప్రజలలోను చులకన భావన కలిగించాయని చెప్పవచ్చు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు .ఆ సమయంలో కావలి ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలపై జగన్ ( Y.S.Jagan Mohan Reddy )ను కలిసి నివేదిక ఇచ్చేందుకు బిజెపి జిల్లా నాయకుడు ప్రయత్నించగా, ఆ నాయకుడు ముందుకు వెళ్లకుండా డి.ఎస్.పి అడ్డుకోవడమే కాకుండా, కాళ్ల మధ్యలో తల నొక్కి పెట్టారు.

ఈ ఫోటో వైరల్ కావడంతో ప్రతిపక్షాలన్నీ ఘాటు గానే స్పందించాయి.కానీ బిజెపి హై కమాండ్ ఈ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో , ఏపీ బీజేపీ నాయకులతో పాటు, జనాల్లోనూ ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరిగింది.కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపి నేతల పరిస్థితి ఏపీలో ఎంత దారుణంగా ఉన్నా, ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం వంటివి ఏపీ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.ఏపీలో బిజెపి బలోపేతం కాకపోవడానికి కారణం స్థానిక నాయకులనే అభిప్రాయాలు మొన్నటి వరకు అందరిలోనూ ఉన్నా, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి కేంద్ర బిజెపి పెద్దలు వైసిపి( YCP ) ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉండడమే కారణమని, ఏపీ ప్రభుత్వంపై స్థానిక నాయకులు ఎన్ని పోరాటాలు చేసినా , కేంద్ర బీజేపీ పెద్దలు ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తుండడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.
అందుకే ఏపీ బీజేపీ నాయకులు ఎన్ని పోరాటాలు చేసినా అవన్నీ వృధాగానే మారిపోతున్నాయి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.