ఐపీఎల్( IPL ) సీజన్ చివరి దశకు చేరుకుంది.ఇంకా ఆరు లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
గుజరాత్ జట్టు( GT ) 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.హైదరాబాద్, ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించాయి.
ఇకపోతే ప్లే ఆఫ్ రేసులో మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
చెన్నై, లక్నో( CSK, LSG ) జట్లు 15 పాయింట్లతో ఉన్నాయి.ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే నేడు జరిగే హైదరాబాద్ – బెంగుళూరు( SRH vs RCB ) మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించాలి.
పంజాబ్ జట్టు తాజాగా ఢిల్లీ చేతిలో( DC ) ఓడినప్పటికీ ప్లే ఆఫ్ చేరే అవకాశం ఇంకా మిగిలే ఉంది.అది ఎలా అంటే రాజస్థాన్ జట్టుపై పంజాబ్ జట్టు విజయం సాధించాలి.
అంతే కాకుండా ఇతర జట్ల గెలుపు ఓటముల పై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.పంజాబ్ జట్టు నాలుగో స్థానానికి రావాలంటే బెంగుళూరు, కోల్ కత్తా జట్లు తమ తర్వాతి మ్యాచ్లలో ఓడిపోవాలి.
అప్పుడు ముంబై, పంజాబ్ జట్ల పాయింట్లు సమానంగా ఉంటాయి.

పంజాబ్ జట్టు రాజస్థాన్( PBKS RR ) పై కనీసం 20 పరుగుల తేడాతో విజయం సాధించాలి.ముంబై జట్టు తర్వాతి మ్యాచ్ లో 26 పరుగుల తేడాతో ఓడిపోవాలి.అప్పుడు పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుతుంది.
ఢిల్లీ చేతులో పంజాబ్ జట్టు ఓడిపోవడం ఒకరకంగా చెన్నై, లక్నో జట్లకు వరమనే చెప్పాలి.నేడు జరిగే మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో బెంగుళూరు ఓడితే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరుతాయి.
తరువాత ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుతుంది.

మరి హైదరాబాద్ చేతిలో బెంగుళూరు ఓడినా కూడా ప్లే ఆఫ్ కు చేరాలంటే చివరి మ్యాచ్లో గుజరాత్ పై విజయం సాధించాలి.ముంబై జట్టు తన చివరి మ్యాచ్లో ఓడిపోవాలి.అంతేకాకుండా రాజస్థాన్, కోల్ కత్తా జట్లు తమ చివరి మ్యాచ్లలో విజయం సాధించాలి.
అప్పుడు బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరుతుంది.ఈ చిక్కుముడులు వీడాలంటే నేడు జరిగే మ్యాచ్ కీలకం.