అందుకే హెల్మెట్ పెట్టుకోలేదు... వివాదంపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్!

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) గత రెండు రోజుల క్రితం సినిమా షూటింగ్ పనులలో భాగంగా వెళుతుండగా అధిక ట్రాఫిక్ జామ్ కారణంగా సినిమా షూటింగుకు ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో ముక్కు మొహం తెలియనటువంటి ఒక సాధారణ వ్యక్తి బైక్ పై లిఫ్ట్ అడిగి ఆయన షూటింగ్ లోకేషన్ కు వెళ్లిన విషయం మనకు తెలిసిందే.ఇదే విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు.

 That's Why He Didn't Wear A Helmet Amitabh Gave Clarity ,amitabh Bachchan, Bolly-TeluguStop.com

ఇలా అమితాబ్ బచ్చన్ బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

Telugu Bollywood, Helmet, Mumbai-Movie

ఇక ఈ ఫోటోలపై పలువురు నేటిజెన్లు స్పందిస్తూ సెలబ్రిటీలకు ఒక రూల్, సాధారణ ప్రజలకు ఒక రూలా అంటూ కామెంట్లు చేశారు.ఎంత సెలెబ్రెటీలు అయితే మాత్రం ఇలా రూల్స్ బ్రేక్ చేస్తారా హెల్మెట్( Helmet ) లేని ప్రయాణం ఎంతో ప్రమాదకరం అనే విషయం తెలియదా అంటూ కామెంట్ చేస్తూ ముంబై పోలీసుల ( Mumbai Police ) ను ట్యాగ్ చేశారు.సెలబ్రిటీలు ఏ పని చేసిన ఆ ప్రభావం ప్రేక్షకుల పైన అభిమానుల పైన తప్పకుండా ఉంటుందని పలువురు ఈ ఫోటోలపై స్పందిస్తూ కామెంట్లు చేశారు.

అయితే ఈ విషయంపై స్పందించిన ముంబై పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ రిప్లై కూడా ఇచ్చారు.ఈ క్రమంలోనే అమితాబ్ హెల్మెట్ ధరించనటువంటి వివాదం గురించి ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

Telugu Bollywood, Helmet, Mumbai-Movie

ఆదివారం కాబట్టి రోడ్డుపై రద్దీ ఉండదని ముంబైలోని బల్లార్డ్‌ వీధిలో( Ballard in Mumbai ) మా సినిమా షూటింగ్‌ ఏర్పాట్లు చేశారు.అక్కడికి కొద్ది దూరంలోనే ట్రాఫిక్ జామ్ కారణంగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామని, అయితే షూటింగుకు ఆలస్యం అవుతుందన్న కారణంగా ఓ అపరిచిత వ్యక్తితో కలిసి తాను బైక్ పై ప్రయాణం చేశాను అయితే తాను వీధిలో ప్రయాణం చేశానని ప్రధాన రహదారిపై ప్రయాణం చేయలేదని తెలిపారు.అంతేకాకుండా తన కారు నుంచి షూటింగ్ లొకేషన్ కు నడిచి కూడా వెళ్ళవచ్చు.కానీ తాను నడిచి వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుందన్న కారణంతోనే బైక్ పై వెళ్ళానని ఈ సందర్భంగా అమితాబ్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube