ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మద్య చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
గత ఎన్నికల ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు నిన్నటికి నిన్న మోడీ సర్కార్ ను ఆకాశానికెత్తారు.ఇదే హాట్ టాపిక్ అనుకుంటే సడన్ గా జనసేన అధినేత పవన్( Janasena Pawan Kalyan ) చంద్రబాబుతో తాజాగా బేటీ అయ్యారు.
స్వయంగా చంద్రబాబు ఇంటికెళ్ళి పవన్ బేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.గతంలో వీరిద్దరు ఇప్పటికే రెండు సార్లు బేటీ అయ్యారు.
అయితే వీరిద్దరు ఎప్పుడు బేటీ అయిన తెరపైకి వచ్చే ఒకే చర్చ టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena Alliance ) వ్యవహారం.ఈ రెండు పార్టీలు పార్టీలు కలుస్తాయని ఎప్పటి నుంచే వార్తలు వస్తూనే ఉన్నాయి.

అలాగే ఇరు పార్టీల అధినేతలు చాలాసార్లు పొత్తుకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు కూడా అయినప్పటికి అధికారికంగా మాత్రం కలిసేందుకు ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉన్నారు.దీనికి కారణం బీజేపీ పార్టీనే అనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.జనసేన ఇప్పటికే బీజేపీ( BBJP )తో పొత్తులో ఉండగా, టీడీపీ ఎప్పటి నుంచో బీజేపీ పొత్తుకోసం చూస్తోంది.కానీ బీజేపీ మాత్రం.
జనసేనతో కలిసేందుకు ఒకే అంటోంది కానీ టీడీపీ( TDP ) కలవడానికి ససేమిరా అంటోంది.దాంతో టీడీపీ బీజేపీ మద్య వారదిలా పవన్ రెండు పార్టీలను కలిపే ప్రయత్నాలు కూడా చేశారు.
ఆ మద్య పవన్ డిల్లీ వెళ్లినప్పుడు బీజేపీ పెద్దలతో దీనివిషయమే ప్రధానంగా చర్చించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

టీడీపీ లేకుండా వైసీపీ( YCP )ని ఢీ కొట్టడం కష్టమని, టీడీపీతో కలిస్తేనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని పవన్ డిల్లీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికి కాషాయ పెద్దలు టీడీపీ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేక పోతున్నారట.ఇంతలోనే చంద్రబాబు( Chandrababu Naidu ) మోడి సర్కార్ పై ప్రశంశలు కురిపించడంతో అతర్గతంగా టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒకే చెప్పిందనే వార్తలు గుప్పుమన్నాయి.
ఇదిలా వైరల్ అవుతున్న నేపథ్యంలో హటాత్తుగా చంద్రబాబుతో పవన్ బేటీ అయ్యారు.దీంతో మూడు పార్టీల మద్య సఖ్యత కుదిరిందని ఇక త్వరలోనే అధికారికంగా పొత్తుల వ్యవహారాన్ని బయటపెట్టే అవకాశం ఉన్నట్లుజ్ తెలుస్తోంది.
మొత్తానికీ బీజేపీ టీడీపీ పార్టీలను కలపాలనుకున్న పవన్ ప్లాన్ గట్టిగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.మరి ఈ మూడు పార్టీలు పొత్తు అంశాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.