జాతకం లో దోషం వల్ల హిట్ కొట్టలేకపోతున్న అఖిల్ ఆ దోషం ఏంటంటే..?

నిన్న మొన్న వచ్చిన హీరోలు కూడా సూపర్ హిట్స్ కొడుతుంటే అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) కి మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో నాగార్జున సపోర్ట్ ఉన్న కూడా సరైన హిట్స్ పడడం లేదనే చెప్పవచ్చు.ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు…ఇక ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం ఏజెంట్( agent ).

 Akhil Is Unable To Hit Due To A Mistake In The Horoscope, What Is That Mistake ,-TeluguStop.com

భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి( Surender Reddy ) డైరెక్ట్ చేయడంతో.

ఏజెంట్ మూవీతో అఖిల్ సక్సెస్ ఈసారిఅందుకుంటారని అభిమానులు బలంగా నమ్మారు.కానీ, సినిమా రిలీజ్ రోజునే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 Akhil Is Unable To Hit Due To A Mistake In The Horoscope, What Is That Mistake ,-TeluguStop.com

సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోలెక పోయింది .దీంతో ఈ సినిమాను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.భారీ ప్రమోషన్స్ నిర్వహించిన ఈ సినిమా.ఇలాంటి కథతో రావడంతో ప్రేక్షకులు మండిపడుతున్నారు.

Telugu Akhil Akkineni, Amala, Surender Reddy, Tollywood, Venu Swami-Movie

ఇక పబ్లిక్ టాక్ ఈ సినిమాకు కామన్ ఆడియెన్స్‌ను దూరం చేసింది.ఒకరకంగా ఈ ఫలితం అఖిల్ కి తీవ్ర నిరాశ కలిగించింది .ఈ క్రమంలోనే వేణు స్వామి అఖిల్ పై సంచలన కామెంట్స్ చేశారు .తాజాగా అఖిల్ జాతకాన్ని బయటపెట్టిన వేణు స్వామి … ఆయనకు హిట్ పడాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని చెప్పుకొచ్చారు .గతంలో నాగచైతన్య సమంత విడిపోతారు అంటూ వేణు స్వామి ముందే చెప్పారు .ఆయన చెప్పిన కొన్నాళ్లకే అది జరిగింది .ఆ తర్వాత వేణు స్వామి చాలా మంది సెలబ్రిటీస్ విషయాలల్లో చెప్పింది కొంతవరకు జరిగింది .ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేని పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి వేణు స్వామి ( Venu Swami )మాట్లాడుతూ.అక్కినేని అఖిల్ కి నాగదోషం ఉంది.ఆ దోషం ఉన్నప్పుడు పక్క వాళ్ళ సలహాలు పనిచేయవు .అంతేకాదు అక్కినేని అఖిల్ జాతక ప్రకారం చంద్రుడు నీచంలో ఉన్నాడు.తల్లి చంద్రుడికి తండ్రి సూర్యుడికి సంకేతం .ఈ విధంగా ఉన్నప్పుడు అఖిల్ అమలకు దూరంగా ఉండాలి .అమల సలహాలు ఏవి తీసుకోకూడదు.మరి ముఖ్యంగా అమల గారి ప్రమేయం మాత్రం కలిసి రాదు అంటూ చెప్పుకొచ్చారు .అంతేకాదు అఖిల్ హిట్ కొట్టాలంటే సొంత తెలివితేటలతో సినిమాను ఓకే చేసుకోవాల్సిందే .నాగదోషానికి నివారణ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు .అఖిల్ కెరియర్ పై వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి .మరి దీనిపై అక్కినేని అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube