మహానటి.ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కీర్తి సురేష్ ( Keerthy Suresh ).ఈమె కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా ఏది అంటే మహానటి అనే చెప్పాలి.ఈ సినిమా ఈమెకు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం తెచ్చిపెట్టింది.
మహానటి సక్సెస్ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అప్పటి నుండి స్టార్ హీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న కీర్తి సురేష్ ప్రజెంట్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా దసరా( Dasara ).న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దసరా”( Dasara ).రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela ) డైరెక్ట్ చేసాడు.ఈ సినిమాలో నాని, కీర్తి ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలో నటించారు.
నాని ధరణి పాత్రలో నటించగా.కీర్తి ‘వెన్నెల’ పాత్రలో నటించింది.ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో వీలైనన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కీర్తి కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.తాజాగా ఈమె దసరా సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది.
ఈ వీడియో అందరిని ఆకట్టు కుంటుంది.కీర్తి సురేష్ పెట్టిన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే.నాని, కీర్తి ఇద్దరు కూడా దసరా లొకేషన్స్ సమయం లోనే అదే గెటప్స్ తో చేసిన చిన్న వీడియో.ఈ వీడియోలో నాని గుడ్ మార్నింగ్ చెప్పగా.
కీర్తి రిలీజింగ్ టుమారో.అని చెప్పిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
మరి ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫలితం రేపు తేలిపోనుంది.