రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న అల్లు అర్జున్ దేశముదురు... ఎప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.హీరోల పుట్టినరోజున వారి సినీ కెరియర్లో సక్సెస్ అయినటువంటి సినిమాలను తిరిగి అభిమానుల కోసం విడుదల చేస్తూ ఉన్నారు.

 Allu Arjun Deshamuduru Is Getting Ready For Re Release When Ramcharan ,desamudur-TeluguStop.com

ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు తిరిగి విడుదల అయ్యి అద్భుతమైన ఆదరణ పొందాయి.ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ ( Ramcharan )పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచినటువంటి ఆరెంజ్( Orange ) సినిమాను తిరిగి విడుదల చేయగా ఈ సినిమా మాత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun) ఏప్రిల్ ఆరవ తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన సినీ కెరియర్లో ఎంతో సూపర్ హిట్ అయినటువంటి దేశముదురు( Desamuduru ) సినిమాని తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని డి వి వి ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.

పూరి జగన్నాథ్( Puri Jaganaath ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హన్సిక(Hansika) జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది.ఇందులోని పాటలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.ఇక అప్పట్లో సిక్స్ ప్యాక్ బాడీ తో అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారని చెప్పాలి.

ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి దేశముదురు సినిమా తిరిగి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

పుష్ప సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube