కోవిడ్ బారినపడ్డ అజయ్ బంగా .. క్వారంటైన్‌లోకి : మోడీ, నిర్మలా సీతారామన్‌లతో భేటీ రద్దు

ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా చేత నామినేట్ చేయబడిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా( American Ajay Banga ) గురువారం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.అయితే అనూహ్యంగా ఆయన కోవిడ్ 19 బారినపడ్డారు.

 Us Candidate For World Bank Head Ajay Banga Tests Positive For Covid-19 In Delhi-TeluguStop.com

అజయ్ బంగాకు చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి.షెడ్యూల్ ప్రకారం అజయ్ బంగా ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi )తో పాటు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్( Minister Nirmala Sitharaman ), విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌లతో సమావేశం కావాల్సి వుంది.

ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.అజయ్ బంగా క్వారంటైన్‌లో వున్నందున ఈ భేటీ రద్దయ్యింది.యూఎస్ ఎంబసీ ప్రతినిధి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.అజయ్ బంగాలో కోవిడ్ లక్షణాలు లేవని, కాకపోతే స్థానిక మార్గదర్శకాలకు కట్టుబడి ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో వున్నాడని చెప్పారు.

ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో మద్ధతు కోసం ప్రపంచ పర్యటనకు బయల్దేరిన అజయ్ బంగా అంతకుముందే అన్ని పరీక్షలు చేయించుకున్నారు.అయినప్పటికీ ఢిల్లీలో ఆయన పాజిటివ్‌గా తేలారు.

న్యూఢిల్లీకి చేరుకోవడంతో అజయ్ బంగా మూడు వారాల గ్లోబల్ లిజనింగ్ టూర్ ( Global Listening Tour )ముగిసినట్లయ్యింది.ఇప్పటి వరకు యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో ఆయన పర్యటించారు.

Telugu Ajay Banga, Delhi, Harbhajansingh, Primenarendra-Telugu NRI

ఇకపోతే.అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా తరపున నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ).ఇప్పటి వరకు ఆయన అభ్యర్ధిత్వం మాత్రమే ఖరారు కాగా.మరే దేశం ఇంకా ముందుకు రాలేదు.

సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలను తొలి నుంచి అమెరికా పౌరులే నిర్వర్తిస్తుండగా.ఐఎంఎఫ్‌కు సారథిగా యూరోపియన్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.

ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద వాటాదారు.ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేనిస్ మాల్పాస్( Dennis Malpass ) ఈ ఏడాది చివరిలో తన పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో అజయ్ బంగా పేరును ఈ పదవికి నామినేట్ చేశారు జో బైడెన్.

Telugu Ajay Banga, Delhi, Harbhajansingh, Primenarendra-Telugu NRI

కాగా.నవంబర్ 10, 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అజయ్ బంగా పూర్తి పేరు.అజయ్ పాల్ సింగ్ బంగా.ఆయన తండ్రి భారత సైన్యంలో ఉన్నత అధికారి.నిజానికి వీరి స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్.అయితే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేది.

అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ బంగా( Harbhajan Singh Banga ).లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.అజయ్ బంగా విద్యాభ్యాసం సికింద్రాబాద్, జలంధర్, ఢిల్లీ, అహ్మదాబాద్, షిమ్లాలలో జరిగింది.బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన ఆయన.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్‌సన్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పట్టా పొందారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీజీపీ, అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ అందుకున్నారు.1981లో నెస్లేలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ బంగా.13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.ఆతర్వాత పెప్సీకోలో పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube