ఈరోజు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.మనోజ్ కు సంబంధించిన వ్యక్తిపై విష్ణు దాడి చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
విష్ణు దీనిపై వివరణ ఇచ్చినా ఆ వివరణ సంతృప్తికరంగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.సొంత అన్నాదమ్ములు కానందుకే వీళ్లిద్దరి మధ్య గొడవలు అని తెలుస్తోంది.
రెండేళ్లుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.మంచు మనోజ్ రెండో పెళ్లి ( Manchu Manoj )వల్ల ఈ వివాదం మరింత పెద్దదైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విష్ణు మనోజ్ చేసిన పనుల వల్ల మంచు ఫ్యామిలీ పరువు పోయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మనోజ్ పెళ్లిలో విష్ణు వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
గత కొన్నేళ్లుగా విష్ణు మనోజ్ పుట్టినరోజున విష్ చేయడం లేదు.
అదే సమయంలో మనోజ్ విష్ణు( Manchu vishnu ) పుట్టినరోజున విష్ చేసినా విష్ణు నుంచి స్పందన ఉండటం లేదు.మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.మంచు ఫ్యామిలీపై నెగిటివిటీ తగ్గుతున్న సమయంలో ఈ విధంగా జరగడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
మోహన్ బాబు ఈ వివాదంలో జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఇటీవల పలు సందర్భాల్లో మనోజ్ విష్ణు ఒకే వేదికపై ఉన్నా ఒకరినొకరు పలకరించుకోలేదు.ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మనోజ్, లక్ష్మీ ప్రసన్న క్లోజ్( Lakshmi Manchu ) గా ఉన్నారు.
అయితే విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.మనోజ్ మీడియాతో మాట్లాడితే గొడవలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.