అల్లు అర్జున్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అనే చెప్పాలి.ఈయన చేసిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
అందులో భాగం గానే కెరియర్ మొదట్లో ఆర్య, బన్నీ, ఆర్య2 లాంటి సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నాడు.అయితే ఈ క్రమంలోనే దిల్ రాజు(Dil Raju) ప్రొడ్యూసర్ గా వాసువర్మ డైరెక్షన్ లో వచ్చిన జోష్ సినిమా(Josh movie) ప్లాప్ అవ్వడంతో చాలా రోజులపాటు ఖాళీ గా ఉన్న డైరెక్టర్ వాసువర్మ ఒక మంచి కథ రాసుకొని దిల్ రాజు గారికి చెప్తే ఆయన అల్లు అర్జున్( Allu Arjun) తో చేద్దాం అని అనుకొని
దిల్ రాజు వాసువర్మ ని వెంటబెట్టుకొని వెళ్లి అల్లు అర్జున్ కి కథ వినిపించాడట.అది విన్న బన్నీ కథ బాగానే ఉంది కానీ ప్రస్తుతం నా డేట్స్ ఖాళీ లేవు అని వాళ్ళతో చెప్పి ఆ సినిమా చేయకుండా ఆ సినిమాని రిజెక్ట్ చేశాడట దాంతో ఇదే కథని హీరో సునీల్ ని పెట్టీ కృష్ణాష్టమి(Krishnashtami) అనే టైటిల్ తో తీశాడు వాసువర్మ అది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ కానీ,ఆయన ఫ్యాన్స్ కానీ ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నాం అనే సంతోషంలో ఉన్నట్లు అప్పట్లో చాలా న్యూస్ లు వచ్చాయి.
ప్రస్తుతం సునీల్ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.
పుష్ప సినిమాలో అయితే సునీల్ మంగళం శీను అనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించి జనులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు అలాగే పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే టాప్ కలెక్షన్స్ వసూల్ చేసిన సినిమా అని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తను చేస్తున్న పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులు కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.