వీధి కుక్కల నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందా? దాడి జరిగినప్పుడు పేపర్ ప్రకటనలు చేయడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని తేలిపోయిందా…? ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జరుగుతున్న వరుస ఘటనకు చూస్తే అదే నిజమని అనిపిస్తుంది.దీనికి నిదర్శనమే బుధవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలిక జహీదా వీధి కుక్కల దాడితో తీవ్రంగా గాయపడింది.
బుధవారం సాయంత్రం తల్లిదండ్రులు లేని సమయంలో పాపా రోడ్డుపై ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి.బాలికపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన బాలికను హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి వైద్యం అందిస్తున్నారు.వీధి కుక్కల దాడులు ఒక వైరస్ లా వ్యాపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.