బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ఈనెల 28న సీనియర్ కౌన్సిల్ వాదనలు వినాలని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో ఈనెల 28న కౌంటర్ పై వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
అయితే, ఫామ్ హౌజ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలని, విచారణకు రావాల్సిందిగా జారీ చేసిన నోటీసును సైతం రద్దు చేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.