పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఈయన లైనప్ చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
మరి ఈ సినిమా అలా ఉండగానే మరిన్ని సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నాడు పవన్.

ఇక ఈయన క్రేజీ లైనప్ లో హరీష్ శంకర్ కూడా ఉన్నారు.ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.ఇక ఇదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక ఇప్పుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.

అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే అప్పుడే హరీష్ శంకర్ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిపాడు. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి.మరి ఈ సంక్రాంతి పూర్తి అవ్వగానే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా ఇప్పుడే మేకర్స్ తమ రిలీజ్ డేట్ లను లాక్ చేసుకుంటున్నారు.
మరి హరీష్ శంకర్ కూడా తాను పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాను 2024 సంక్రాంతికే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ గురించి తెలిపాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2024 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అధికారికంగా చెప్పారు.అయితే ఇది సాధ్యం అవుతుందా లేదా అని అందరిలో ఒక సందిగ్ధం అయితే ఉంది.
అదీ కాకుండా ఈ రోజు సుజిత్ తో చేయనున్న సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు.మరి ముందుగా హరీష్ సినిమా మొదలు పెడతారో లేదో అనే డౌట్ అయితే ఉంది.