యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ కు మళ్లీ బ్యాడ్ న్యూస్.ఇటీవలే ఎన్టీఆర్ 30 యొక్క చిత్రీకరణ 2023 సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ యొక్క సినిమా విడుదల తేదీని కూడా అదే సమయంలో ప్రకటించారు.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 సినిమా యొక్క షూటింగ్ ప్రారంభానికి మళ్లీ తారకరత్న విషయంలో అడ్డంకి అయ్యింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ బెంగళూరులో ఉన్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు సంబంధించిన చర్చ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
కానీ బెంగళూరులో ఉండటం వల్ల ఎన్టీఆర్ 30 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయినట్లుగా టాక్ వినిపిస్తుంది.ఫిబ్రవరి లో సినిమా ను పట్టాలెక్కిస్తే తప్పకుండా అనుకున్న సమయంకు అంటే వచ్చే ఏడాది లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావించారు.
కానీ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మారే అవకాశాలు ఉండటంతో విడుదల తేదీ విషయంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇప్పుడు షూటింగ్ ఆలస్యం అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేయడం జరిగింది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఇంకా హీరోయిన్ విషంయలో క్లారిటీ రాలేదు.ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం అయితే హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేది.కానీ ఇప్పుడు హీరోయిన్ విషయంలో క్లారిటీ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.ఎన్టీఆర్ సినిమా కోసం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.