సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రే గోల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది.పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.మృతులు సైదులు, సాయికుమార్ లుగా గుర్తించారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.